నాలుగుకోట్ల మంది భక్తులు మహా పుష్క రాల్లో పాల్గొనే అవకాశం ఉంది. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా వివిధ పూజలు, ఆచారాలను ఆచరించేందుకు పూజారుల్ని వెతుక్కోవడం కష్టంతో కూడుకున్న పని. అలాంటి కష్టాలు భక్తులకు లేకుండా ఆధునిక సాంకేతికతను చెంతకు చేర్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటే చాలు. మీ ఆంఢ్రాయిడ్ ఫోన్ ద్వారా పూజారుల్ని బుక్ చేసుకోవచ్చు.

ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే పూజారుల సేవలు పొందవచ్చు. పిండ ప్రదానాలు, వైదిక కర్మలను పూజారుల ద్వారా పూర్తిచేసుకోవచ్చు. ఆఖరి నిముషంలో పూజారుల కోసం హైరానా పడకూడదని ప్రభుత్వం ఈ ఏర్పాటుచేసింది. ఈ వెబ్ సైట్ లో ఉన్న లింకు ద్వారా యాప్ ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను భక్తులు వినియోగించుకుని, పుష్కరాలను మరపురాని అనుభూతిగా మార్చుకోవచ్చు.

మహా పుష్కరం ఆండ్రాయిడ్ ఆప్ ని డౌన్ లోడ్ చేసుకోండి

NO COMMENTS

LEAVE A REPLY