గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేసింది.

ఏర్పాట్లలో ముఖ్యాంశాలు

 • పుష్కరాలకు వచ్చే యాత్రీకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 24 ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేసింది. పుష్కరాల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి భక్తులకు తెలియచేసేందుకు వీటిని నెలకొల్పింది.
 • భక్తుల సౌకర్యార్థం బీఎస్ఎన్ఎల్ సంస్థ ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించింది. సూపర్ ఫాస్ట్ కనెక్టివీ కలిగిన ఈ వైఫై సౌకర్యం భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని బీఎస్ఎన్ ఎల్ సంస్థ ప్రకటించింది. బస్టాఫ్ లు జనసమ్మర్ధం ఉన్న చోట వీటిని ఏర్పాటుచేసింది.
 • పుష్కరాల్లో వివిధ ఆద్యాత్మిక ఆచారాలను నిర్వహించేందుకు 400 మంది పూజారులను నియమించింది. వారికి గుర్తింపు కార్డులు కూడా జారిచేసింది.
 • పూజారుల కోసం పుష్కర ఘాట్ల దగ్గర ప్రత్యేక వసతి సౌకర్యం అందుబాటులో ఉంది.
 • పుష్కరాల కోసం 15 వేలమంది పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. వివిధ ప్రాంతాల్లో వారు తమ సేవలు అందిస్తారు.
 • పుష్కర ఘాట్లు, భక్తులు ఉండే వసతి కేంద్రాల వద్ద పారిశుద్ధ్య సమస్యలు రాకుండా ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పించింది. 15 వేల డస్ట్ బిన్ లు ఏర్పాటుచేసింది.
 • పుష్కరాలు పూర్తయ్యేవరకూ పారిశుద్ధ్య కార్మికులు తమ విధుల్లో ఉంటారు. గంట గంటకూ పారిశుద్ధ్యం పై కార్మికులు కంట్రోల్ రూంకి సమాచారం అందిస్తారు.
 • మెడికల్ క్యాంప్ లు కూడా అందుబాటులో ఉంటాయి. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మూడు షిప్టుల్లో తమ విధులు నిర్వర్తిస్తారు.వారిని మూడు కేటగిరీలుగా విభజించారు.
  • కేటగిరీ ఎ – పెద్ద పుష్కర ఘాట్లలో మూడు షిప్టుల్లో విధులు నిర్వర్తిస్తారు.
  • కేటగిరీ బి- మధ్యస్తంగా ఉన్న పుష్కర ఘాట్లు ఉన్నచోట రెండు షిప్టుల్లో విధుల్లో ఉంటారు
  • కేటగిరీ సి- గ్రామాల్లో ఉన్న పుష్కర ఘాట్ల దగ్గర ఒక షిప్టులో వైద్య ఆరోగ్యసిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.
 • అత్యవసర సమయంలో ఆదుకునేందుకు ఫైర్ సర్వీసులు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా 3500 మంది గజఈతగాళ్ళు, 871 బోట్లు ఘాట్ల దగ్గర ఉన్నాయి. 18 వేల మంది పోలీసు సిబ్బంది తమ తమ స్థానాల్లో భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు.
 • మొత్తం 458 సీసీటీవీలు అందుబాటులో ఉంచారు. పుష్కరాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీటీవీల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తారు.
 • బాగా జనసమ్మర్ధం ఉన్నచోట ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్శిటీలు, హోటల్స్, రిసార్ట్ లు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాల్లో పుష్కరాలకు వచ్చే భక్తులకోసం వసతి సౌకర్యం కల్పిస్తారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
 • అవసరమయితే భక్తుల కోసం ఏసీ స్లీపర్ బస్సుల్ని వినియోగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు.
 • పుష్కరాల సందర్భంగా రోజంతా వివిధ ప్రాంతాల్లో సాహిత్య, ఆధ్యాత్మిక సాంస్క్రతిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, ఫోటో ఎగ్జిబిషన్లు, కూచిపూడి నాట్యం, కళా ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. గోదావరి నదిలో లక్షలాది మంది భక్తులున్న ఫోటోలను కూడా మీడియాకు విడుదలచేస్తారు.
 • సినీ, ఇతర రంగాల ప్రముఖులు తమవంతు సాయం చేస్తారు. టూరిజం శాఖవారు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటుచేశారు. విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి నుంచి ఈ ప్యాకేజీలు ఇతర ప్రాంతాలనుంచి అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా ఆకాశంలో దీపాల పండుగ, ఫుడ్ ఫెస్టివల్ అందుబాటులోకి తెచ్చారు.
 • గోదావరి జల్ పేరుతో పుష్కర జలాలను ఇంటికి తీసుకెళ్ళేందుకు ఏర్పాట్లుచేశారు. పోస్టల్ శాఖ ద్వారా అరలీటరు బాటిళ్ళను ఏర్పాటుచేశారు. రూ.20 చెల్లించి ఈ బాటిళ్ళను భక్తులు కొనుగోలుచేయవచ్చు. ప్రభుత్వం, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆద్వర్యంలో కూరగాయలను సబ్సిడీ ధరలకు అందించే ఏర్పాట్లుచేశారు.
 • గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
 • పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు గోదావరి ప్రాంతం జనసమ్మర్థంగా ఉంటుంది కాబట్టి అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుష్కరాల కు వచ్చే భక్తులను స్థానికులు తమ ఆత్మీయ అతిథులుగా చూడాలని ప్రభుత్వం కోరుతోంది. 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాపుష్కరం ఈసారి మరపురాని మదుర స్మ్మతిగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లుచేసింది.

NO COMMENTS

LEAVE A REPLY