పావన గోదావరి జీవనది. గోదావరి మాత ఎంతోమందికి జీవనాధారం. ఆంధ్రప్రదేశ్ లోని వేలాది గ్రామాలు గోదావరి జలాలతో పునీతం అవుతున్నాయి. గోదావరి ఒడ్డున వేలాది గ్రామాలు వెలశాయి. గోదావరి ఒడ్డున మహా పుష్కరాల సందర్భంగా 151 పుష్కర ఘాట్ లను నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. తూర్పుగోదావరి తో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో 89 ఘాట్లను నిర్మించారు.

పుష్కరాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా పాలనా యంత్రాంగం ఎన్నో చర్యలు తీసుకుంది. అనేక సౌకర్యాలు కల్పించింది.

 • పుష్కర స్నానాల కోసం స్నానఘట్టాలు
 • మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు
 • ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా సురక్షితంగా స్నానఘట్టాలకు వెళ్ళేందుకు బారికేడ్డు
 • పిండ ప్రదానాల కోసం ప్లాట్ ఫారంలు
 • పబ్లిక్ టాయిలెట్లు
 • సురక్షిత మంచినీరు
 • భద్రతా సౌకర్యాలు
 • సమాచార వ్యవస్థ
 • పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సౌకర్యాలు

తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన పుష్కర ఘాట్లు:

 1. రాజమండ్రి కోటిలాంగాల ఘాట్
 2. రాజమండ్రి పుష్కర ఘాట్
 3. రాజమండ్రి మార్కండేయ ఘాట్ (పద్మావతీ ఘాట్)
 4. రాజమండ్రి సరస్వతి ఘాట్
 5. రాజమండ్రి పుష్కరాల పేట ఘాట్ (గౌతమీ ఘాట్)
 6. ధవళేశ్వరం రామపాదాల రేవు ఘాట్
 7. కోటి పల్లి కోటిపల్లి ఘాట్

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పుష్కర ఘాట్లు:

 • కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఘాట్
 • నరసాపురం వాలంథరీ రేవు
 • కొవ్వూరు శ్రీ క్రిష్ణ చైతన్య ఘాట్
 • కొవ్వూరు శ్రీ శ్రీనివాస ఘాట్
 • కొవ్వూరు దండగుండరపుంత రేవు (గౌతమీ ఘాట్)
 • కొవ్వూరు హరిజనవాడ సమీపంలోని ఘాట్
 • కొవ్వూరు సీతారామ ఘాట్
 • కొవ్వూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఘాట్
 • కొవ్వూరు భక్తాంజనేయ ఘాట్
 • కొవ్వూరు వీరిణమ్మ ఆలయం ఘాట్
 • నరసాపురం లలితాంబ ఘాట్
 • నరసాపురం అమరేశ్వర స్వామి ఘాట్
 • నరసాపురం కొండాలమ్మ ఘాట్

NO COMMENTS

LEAVE A REPLY