గోదావరి శోభాయాత్ర

0
1127

గోదారమ్మకు నీరాజనం -సకల కోటికి శుభదాయకం ‘గోదావరి శోభాయాత్ర.

గోదావరి మహా పుష్కరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి శోభాయాత్ర నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలను ఈ మహాత్కార్యంలో భాగస్వాముల్ని చేసింది. ప్రారంభంలో కేవలం ఉభయ గోదావరి జిల్లాలను ఇందులో భాగస్వాముల్ని చేయాలని సంకల్పించింది. తర్వాత 13 జిల్లాలు ఇందులో పాల్గొనాలని భావించిన ప్రభుత్వం గోదావరి శోభాయాత్ర నిర్వహిస్తోంది.

గోదావరి శోభాయాత్ర కార్యక్రమంలో ముఖ్యాంశాలు:

ప్రతి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆధ్వర్యంలోని భక్తుల సమూహం పాదయాత్ర ద్వారా రాజమండ్రి చేరుకుంటుంది. మహా పుష్కరంలో భాగంగా ఆయా జిల్లాలకు కేటాయించిన సమయంలో జిల్లానుంచి వచ్చిన భక్తులు కోటిలింగాల రేవునుంచి పవిత్ర జలాలను తీసుకుని తమ తమ ప్రాంతాలకు వెళతారు. అలా తీసుకుని వెళ్ళిన నీటిని ఆయా ప్రాంతాల్లోని వాటర్ ట్యాంకుల్లో కలిపి ఆ నీటి ద్వారా దేవాలయాల్లో అభిషేకానికి ఉపయోగిస్తారు.

ఈ గోదావరి శోభాయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిపే బ్రోచర్ ను ప్రభుత్వం విడుదల చేసింది. గోదావరి శోభాయాత్ర బ్రోచర్ ని చదివితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY