పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణం కొవ్వూరు. గోదావరి నది ప్రవహించడం వల్ల కొవ్వూరుకి ఎంతో ఖ్యాతి వచ్చింది. రైలు సౌకర్యం, రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉండడం కొవ్వూరుకున్న ప్రత్యేకతగా చెప్పకోవచ్చు. గోదావరి నదిని రోజూ చూసేందుకు వేలాదిమంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దీంతో కొవ్వూరు ఎప్పుడూ జనసంద్రంగా ఉంటుంది. అంతేకాదు ఎంతో పదవీవిరమణ పొందినవారు కొవ్వూరులో తమ శేష జీవితం హాయిగా గడపాలని కోరుకుంటారు. ఇక్కడి గోదావరి ఘాట్ లో ప్రయాణం మరచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

గోదావరి నదిపై ఇక్కడ మూడు బ్రిడ్జిలు నిర్మించారు. కొవ్వూరు రాజమండ్రిని ఇవి కలిపే వారధులు. సర్ ఆర్దర్ కాటన్ నిర్మించిన పాత వంతెనను ప్రస్తుతం మూసివేశారు. 1900 వ సంవత్సరం ఆగస్టు 30న కాటన్ ఈ బ్రిడ్జిని ప్రజోపయోగం కోసం ప్రారంభించారు. అదే క్రమంలో 1974 లో రైల్ కం రోడ్డు బ్రిడ్జిని నిర్మించారు. 1995 లో భారతీయ రైల్వే వారు ఒక బ్రిడ్జిని నిర్మించారు. గంగా నదిపై నిర్మించిన గంగా రైలు బ్రిడ్జి తర్వాత రెండవ అతి పెద్ద బ్రిడ్జిగా ఇది ప్రఖ్యాతి పొందింది. రాజమండ్రితో సంబంధం లేకుండా కొవ్వూరు దగ్గర మరో బ్రిడ్జి నిర్మాణం పురోగతిలో ఉంది.

ఆధ్యాత్మిక క్షేత్రాలు

కొవ్వూరులో గోష్పాద క్షేత్రం చెప్పుకోదగిన గొప్ప ఆధ్మాత్మిక కేంద్రం. కొవ్వూరులో ఎన్నో ఆలయాలున్నాయి. శివాలయం. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, గాయత్రీ దేవి ఆలయం, రామాలయం,వేణుగోపాల స్వామి ఆలయం, షిర్డీ సాయిబాబా ఆలయం, గాయత్రీ గోశాల ముఖ్యమైనవి. గోదావరి దగ్గర లాంచీల రేవు, గౌడీయ మఠం ఖ్యాతి పొందాయి. ఇక్కడి ఆలయంలో నిత్యం భజనలు, పారాయణలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాలతో పాటు కొవ్వూరులో శ్రీ వీరభద్రస్వామి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, కొవ్వూరమ్మ ఆలయం, వరద గోపాలస్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం,శాంతి మఠం ఉన్నాయి.

గణాంకాలు

2001 జనాభా లెక్కల ప్రకారం కొవ్వూరు జనాభా 40వేలు. కొవ్వూరులో 70 శాతం అక్షరాస్యత నమోదైంది. జాతీయ సగటుకంటే ఇదే ఎక్కువ కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో మిగతా పట్టణాలతో పోలిస్తే అక్షరాస్యతలో 6 శాతం పెరుగుదల నమోదయింది.

మౌలిక, రవాణా సదుపాయాలు

కొవ్వూరు రైల్వేస్టేషన్ లో 3 ప్లాట్ ఫారాలు ఉన్నాయి. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. నూతనంగా కొవ్వూరు- భద్రాచలం రోడ్డు రూట్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, అవంతీ ఫీడ్స్ లిమిటెడ్ వంటి ప్రముఖ పరిశ్రమలు ఇక్కడ ఉండడంతో ఉపాధి కోసం వేలాదిమంది యువతీ యువకులు ఇక్కడి వస్తుంటారు. దీంతో పట్టణ జనాభా భారీగా పెరిగిపోతోంది. కొవ్వూరు పారిశ్రామికంగానే కాదు, నివాసయోగ్యంగా, పర్యాటక, వ్యవసాయరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. విశాఖ, విజయవాడలకు వెళ్ళేందుకు రైల్వే కనెక్టివిటీ ఉండడం అదనపు ఆకర్షణ.

ఇటీవల కాలంలో కొవ్వూరులో అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రగతిశీల నిర్ణయాలతో రాష్ట్రం ముందుకుసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల వ్యవస్థను సమూలంగా మార్చేశారు. ప్రధాన రహదారుల్లో వన్ వే రూట్ లు ప్రవేశ పెట్టడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతోంది. ఇక్కడ ఇటీవలి కాలంలో అపార్టుమెంట్ కల్చర్ కూడా బాగా పెరిగిపోయింది. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకోవడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. మధురపూడి విమానాశ్రయం 25 కిలోమీటర్ల దూరంలో ఉండడం కూడా కొవ్వూరుకున్న అదనపు ఆకర్షణ. కొవ్వూరు ఇటు సినీరంగాన్ని కూడా ఆకట్టుకుంటోంది. స్వాతిముత్యం, సీతారామయ్య గారి మనవరాలు, మురారి, సింహాద్రి, మంగతాయారు టిఫిన్ సెంటర్, కొత్త బంగారు లోకం వంటి ఎన్నో సినిమాల షూటింగ్ లు ఇక్కడ జరిగాయి.

కొత్త బ్రిడ్జి

దేశంలో ఎక్కడా లేని విధంగా యూ ఆకారంలో నిర్మించిన బ్రిడ్జి కొవ్వూరుకి ఖ్యాతిని తెచ్చిపెట్టింది. కొవ్వూరు, రాజమండ్రిని కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జి ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. రైళ్ళ వేగం పెంచడానికి ఈ ఏర్పాటు జరిగింది. హిందుస్థాన్ కనస్ట్రక్షన్ కంపెనీ ఈ బ్రిడ్జిని నిర్మించింది. స్విట్జర్లాండ్ కి చెందిన బీబీఆర్ కంపెనీ నిర్మిస్తే జర్మనీ కి చెందని ప్రముఖ నిర్మాణ సంస్థ లీయెనార్డో ఆండ్రియా సాంకేతిక పర్యవేక్షణ చేసింది. ఈ బ్రిడ్జి నిర్మాణం 1991 లో ప్రారంభమై 1997 లో పూర్తయింది. మార్చి 1997 నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి ఇచ్చారు. రైళ్ళ రాకపోకలను 2003 లో అనుమతించారు.

రైల్ కం రోడ్డు బ్రిడ్జి

కొవ్వూరు సమీపంలో ఉన్న రైల్ కం రోడ్డు బ్రిడ్జి ఆసియాలోనే ఖ్యాతిని పొందింది. ఆసియాలోనే రెండవ అతిపెద్ద బ్రిడ్జిగా రికార్డులకెక్కింది. ఈ బ్రిడ్జి పొడవు 4. 732 కిలోమీటర్లు. 1972 లో భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అప్పట్లో ఈ బ్రిడ్జికి 63 కోట్లు ఖర్చయ్యింది. స్థానిక ప్రజలు దీన్ని కొవ్వూరు బ్రిడ్జి అని పిలిచేవారు. ఈ బ్రిడ్జి కొవ్వూరు ని రాజమండ్రితో కలుపుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం ఎగుమతులకు ఈ బ్రిడ్జి ప్రధాన రహదారిగా ఉపయోగపడుతోంది.

పాత గోదావరి బ్రిడ్జి

హేవలాక్ బ్రిడ్జిగా పిలవబడే పాత గోదావరి వంతెన నవంబర్ 11, 1897 లో నిర్మాణం పూర్తి చేసుకుంది. మూడేళ్ళ అనంతరం ఆగస్టు 30, 1900 సంవత్సరంలో ట్రాఫిక్ అనుమతించారు. ఈ బ్రిడ్జికి సన్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హేవలాక్ అని పేరు పెట్టారు. హేవలాక్ మద్రాసు గవర్నర్ గా పనిచేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఫ్రెడరిక్ థామస్ గ్రాన్ విల్లె వాల్టన్ అనే ఇంజనీర్ రూపకల్పన చేసి నిర్మించారు. ఆయనకు ఆర్ ఎ డెలాన్ గ్రేడ్ సహాయ సహకారాలు అందించారు. ఈ బ్రిడ్జి పొడవు 9,035 అడుగులు, వందేళ్ళపాటు మన్నిక కలిగేలా దీన్ని నిర్మించారు. సరిగ్గా వందేళ్ళ అనంతరం 1997 లో దీనిపై రాకపోకలు నిలిపివేశారు.

NO COMMENTS

LEAVE A REPLY