గోదావరి మహా పుష్కరాలు విశిష్టతను యావత్ ప్రపంచానికి తెలియచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘పుష్కర గోదావరి పిలుస్తోంది’ పేరుతో ఆడియో సీడీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రిలో విడుదలచేశారు. ‘గోదావరి అఖండ హారతి’ కార్యక్రమంలో ఈ ఆడియో సీడిని ఆవిష్కరించారు.

ప్రముఖ సినీ గీత రచయితలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అనంత శ్రీరాం రాసిన ఈ గీతాలను ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, హేమచంద్ర ఆలపించారు. ఇక్కడి లింక్ ద్వారా ఈ పాటలు అందరికీ అందుబాటులో ఉంటాయి. మొత్తం ఆరుపాటలు గోదావరి మాత విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY