గతంలో జరిగిన గోదావరి పుష్కరాల్లో ఎన్నో ముఖ్య ఘట్టాలు, మధురానుభవాలు ఉన్నాయి. 2003 జూలై 30 నుంచి, ఆగస్టు 10 వరకూ పుష్కరాలు జరిగాయి. అప్పుడు మూడుకోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. కాకతాళీయంగా అప్పుడు కూడా నారాచంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పుష్కర ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

అప్పట్లో పుష్కర స్నానాల కోసం గోదావరి నది పొడవునా 170 పుష్కర ఘాట్లు నిర్మించారు. గోదావరి పరివాహక జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఈ ఘాట్లు నిర్మించారు. అప్పట్లో జరిగిన గోదావరి పుష్కరాల సింహావలోకనాన్ని స్లైడ్ షో ద్వారా తిలకించవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY