రాజ‌మండ్రి కోటిలింగాల పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విషాదంపై మీడియాతో మాట్లాడుతూ కంటతడిపెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగిందన్న ఆయన, ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఘాట్ల వద్ద పోలీసుల సూచనల ప్రకారం భక్తులు వ్యవహరించాలన్నారు. అందరూ ఒకేసారి ఘాట్ల వద్దకు రావద్దని చంద్రబాబు సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY