మొదటిరోజు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటన ఊహించనిది. 27 మంది యాత్రీకులు చనిపోవడం విచారకరం. వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయచర్యలు తీసుకోగలిగాం. కంట్రోల్ రూం నుంచి అన్ని చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాం.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి పరామర్శించారు, గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు, చనిపోయినవారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు.

పోలీస్ కంట్రోల్ రూం లో ఎక్కువ సేపు గడిపిన సీం చంద్రబాబునాయుడు అక్కడ జరుగుతున్న మోనిటరింగ్ చేస్తున్న తీరును పరిశీలించారు, ప్రతి ఘాట్ లో భక్తుల రాక, వారికి అందుతున్న సౌకర్యాలను ఇన్ ఛార్జిని అడిగి తెలుసుకున్నారు, ప్రతిరోజు సాయంత్రం అన్ని ఘాట్ల ఇన్ ఛార్జిలను పిలిచి సమీక్ష నిర్వహించారు,

30 కంపెనీల సీఆర్ పీఎఫ్, ఐటీబీపీ సిబ్బందిని పుష్కరాల విధులకు తరలించారు, మొదటిరోజు 24 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. రెండవ రోజు కూడా మొదటిరోజు కంటే ఎక్కువమంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు.

పుష్కరాల కు వచ్చే భక్తులకు అందుతున్న సేవలను వాట్పప్ నెంబర్ కూడా కేటాయించారు. అంతేకాదు ఐవీఆర్ ఎస్ ద్వారా భక్తులనుంచి స్పందనను కూడా తీసుకుంటున్నారు. వాటర్ సప్లై, శానిటేషన్, ఉచిత సదుపాయాలపై భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు, అధికారుల తీరును కూడా ఐవీ ఆర్ ఎస్ ద్వారా సేకరిస్తున్నారు. అన్ని ఘాట్ లలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, రెండవరోజు ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పుష్కరాలు పూర్తయ్యాయి.

NO COMMENTS

LEAVE A REPLY