ఏడాదిగా ఎదురుచూస్తున్న మ‌హా పుష్క‌ర సంరంభం క‌నుల పండువగా ప్రారంభ‌మ‌య్యాయి. సోమ‌వారం సాయంత్రం పుష్క‌ర ఘాట్ లో ల‌క్ష ఒత్తులు వెలిగించి గోదావ‌రి త‌ల్లికి దీపారాధ‌న చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు. అనంత‌రం అఖండ హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. న‌మూనా ఆల‌య స‌ముదాయాల‌ను ప్రారంభించారు సీఎం చంద్ర‌బాబు.

అనంత‌రం మంగ‌ళ‌వారం ఉద‌యం 6.26 నిముషాల‌కు గురుడు సింహ‌రాశిలోకి ప్ర‌వేశించ‌డంతో గోదావ‌రి మ‌హా పుష్క‌రాలు అంగ‌రంగ వైభ‌వంగా ఆరంభ‌మ‌య్యాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స‌తీస‌మేతంగా పాల్గొని పుష్క‌ర స్నానాలు ఆచ‌రించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోకంచికామ‌కోటి పీఠాధిప‌తి విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుష్క‌ర స్నానం చేసి పుష్క‌రాల‌ను ప్రారంభించారు.

గోదావ‌రి మ‌హా పుష్క‌రాల ఆరంభ స‌న్నాహాలు అంబ‌రాన్నంటాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన లేజ‌ర్ షో  ఆక‌ట్టుకుంది. రాష్ట్ర ప్ర‌భుత్వం పుష్క‌ర స్వాగ‌తోత్స‌వాన్ని క‌నుల పండువ‌గా చేసింది. గోదావ‌రి మాత‌కు శాస్త్రోక్తంగా అఖండ హార‌తి భ‌క్తుల‌ను ఆధ్యాత్మికానంద ప‌ర‌వ‌శుల్ని చేసింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, త‌న‌యుడు లోకేష్  ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. వివిధ జిల్లాల‌కు చెందిన `1000 మందికి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు రాజ‌మండ్రి పుర‌వీధుల గుండా ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. గోదావ‌రి తీరంలోని వివిధ ప్రాంతాల‌నుంచి వ‌చ్చిన మ‌హా పుష్క‌ర అఖండ స్వాగ‌త జ్యోతిని చంద్ర‌బాబు అందుకున్నారు, న‌దిలో ఏర్పాటుచేసిన వేదిక‌పై పండితులు గోదావ‌రి మాత‌కు వివిధ హార‌తుల‌తో నీరాజ‌నం ప‌లికారు. సినీ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది, లేజ‌ర్ షో నేత్రానందం క‌లిగించింది.

NO COMMENTS

LEAVE A REPLY