గోదావరి మహా పుష్కరం 2015 కి స్వాగతం

0
1296

గోదావరి మహా పుష్కరం  2015 కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతోంది.  ఈ పుష్కరాలు 13 జిల్లాల సమాహారమయిన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని, కీర్తిని నలుదిశలా చాటిచెబుతుంది. రెండు గోదావరి జిల్లాలకు ఇది ప్రత్యేకం. పుష్కరుడితో పాటు సకల దేవతలూ ఈ పుష్కరాల సమయాన గోదావరిలోకి ప్రవేశిస్తారు. జీవితంలో ఒకసారి వచ్చే అద్భుతమయిన అవకాశం. గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేద్దాం. గోదావరి మాత ఆశీస్సులు అందుకుందాం. గోదావరి మాతతో పాటు మన పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చుదాం.

గోదావరి మహా పుష్కరం మీకు మరపురాని అనుభూతిని కలిగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY