గోదావరి మహా పుష్కరం 2015 పరిచయం – వీడియో

0
2312

గోదావరి మహా పుష్కరం 2015 జూలై 14 నుంచి 25జూలై 15 వరకూ జరుగుతోంది. గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఈసారి వచ్చిన పుష్కరాలకు ఎంతో విశిష్టత ఉంది. బృహస్పతి సింహరాశి లోకి ప్రవేశించినపుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాలు ఆంధ్రప్రదేశ్ కి ఎంతో ముఖ్యమయినవి. ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మన గోదావరి పుష్కరాలకు అంతటి విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు.

ఈసారి వచ్చిన పుష్కరాలు సాధారణమయినవి కావు. మహా పుష్కరాలు. ప్రతి 12 పుష్కరాలకు ఒకసారి మహా పుష్కరం వస్తుంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరంలో మనం పాల్గొనడం మన పూర్వజన్మ ఫలంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ 2159 లో మహా పుష్కరం వస్తుంది. దీన్ని బట్టి ఈ మహా పుష్కరాలకు ఎంతటి ప్రాధాన్యత, విశిష్టత ఉందో అర్థం చేసుకోవచ్చు. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

ఈ వీడియో గోదావరి గోదావరి పుష్కరం గురించి తెలియచేస్తుంది. అందులోనూ గోదావరి మహా పుష్కరం ప్రాధాన్యతను, విశిష్టతను వివరిస్తుంది.

NO COMMENTS

LEAVE A REPLY