మహా పుష్కరాల్లో నాలుగోరోజు

0
2140

గోదావ‌రి మ‌హా పుష్క‌రాలు పూర్తయ్యేవరకూ రాజమండ్రిలోనే బస చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు పునరుద్ఘాటించారు, గోదావరి మహా పుష్కరాల ఈ నెల 25న ముగుస్తాయి. జూలై 26న ముఖ్యమంత్రి విందు ఏర్పాటుచేస్తున్నారు. పుష్కరాల కోసం నిరంతరం పనిచేసిన అధికారులు, బాధ్యులందరినీ విందుకు ఆహ్వానిస్తున్నారు, పుష్కరం ఇన్ ఛార్జిలు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు,

పుష్కరఘాట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, యాత్రీకులకు తాగునీటి వసతి కల్పించాలని ఆయన ఆదేశించారు. పుష్కర ఘాట్లకు వెళ్ళే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు, పుష్కర స్నానాలకు వచ్చే యాత్రీకుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

జూలై 17 వరకూ 60 లక్షలమందికి పైగా యాత్రీకులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గోదావరి మహా పుష్కరాల్లో పుష్కరస్నానాలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాజమండ్రిలోనే 35 లక్షలమందికి పైగా పుణ్య స్నానాలు చేశారని ముఖ్యమంత్రి తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY