నవ్యాంధ్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం పుణ్య గోదావరి సాక్షిగా ఆవిష్కృతమయింది.  మన నూతన రాజధాని అమరావతి ముఖ్య ప్రాంత నిర్మాణానికి బృహత్తర ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. రాజమండ్రిలోని షెల్టన్ హోటల్ లో అమరావతి నగర నాలుగవహైలెవల్ కమిటీ సమావేశం నిర్వహించారు.

పవిత్ర పుష్కరాల సమయంలో సింగపూర్ ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ అందించడం శుభసూచకం అన్నారు సీఎం చంద్రబాబునాయుడు. అనంతరం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి గోదావరి నిత్యహారతిని తిలకించారు. నిత్యహారతి వైశిష్ట్యాన్ని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు వివరించారు గోదావరి మహా పుష్కరం నిర్వాహక కమిటీ ఛైర్మన్ డా. పరకాల ప్రభాకర్.

ఏడురోజుల పుష్కరాలు – భక్తుల వివరాలు

 పుష్కరాలు ప్రారంభమయినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఉభయ గోదావరి జిల్లాల్లో నమోదైన పుష్కర యాత్రీకుల వివరాలు:

  • మొదటి రోజు      14.07.15         23,46,485
  • రెండవరోజు        15.07.15         24,23,151
  • మూడవరోజు      16.07.15         30,77,308
  • నాలుగవరోజు     17.07.15         30,73,341
  • ఐదవరోజు         18.07.15         58,25,721
  • ఆరవరోజు         19.07.15         56,22,531
  • ఏడవ రోజు        20.07.15         43,79,692
  • మొత్తం పుష్కర యాత్రికులు  (సోమవారం రాత్రి 7 గం.ల వరకూ ) – 2 కోట్ల 67లక్షల 48 వేల 229.

NO COMMENTS

LEAVE A REPLY